ముగిసిన వరంగల్ ఉపఎన్నిక పోలింగ్..
Published on: Sat Nov 21, 2015 4:07PM

వరంగల్ ఉపఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ సాగిన ఈ ఎన్నిక పోలింగ్ లో.. ఐదు గంటల వరకూ క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే పట్టణాలలో కంటే పల్లెల్లో ఓటింగ్ పై భారీ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. కాగా పోలింగ్ సమయం ముగిసే సరికి మొత్తం 63.5 శాతం ఓటింగ్ నమోదు అయింది. వరంగల్ ఉపఎన్నికకు మొత్తం 23 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.. ఫలితాలు ఈ నెలం24న విడుదల చేయనున్నారు.


