TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

Published on: Sun Sep 21, 2025 3:49PM

 

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాజీపేట అయోధ్య పురానికి చెందిన జ్యోతి ఈ నెల 17న తీవ్ర జ్వరంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరికైంది. చికిత్స నిర్వహించిన వైద్యులు రక్తం ఎక్కించాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో జ్యోతి రక్త నమూనాలను  సేకరించి పరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉండడం రక్త కణాల సంఖ్య పడిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలని జ్యోతి బంధువులకు సూచించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని రక్త నిధి నుండి రక్తాన్ని తీసుకురాగా ఓ పాజిటివ్ కు బదులుగా వైద్యులు బి పాజిటివ్ ఎక్కించారు. 

ఈ క్రమంలో జ్యోతి ఒంటిపై దురద రావడంతో వైద్యులకు తన సమస్యను వివరించడంతో.. మరోసారి రోగికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ  పాజిటివ్ కు బదులుగా మరో గ్రూప్ రక్త లెక్కించడంపై కంగుతున్న వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉంటే వైద్యులు సిబ్బంది లక్ష్యం కారణంగా తమ కూతురు ఆరోగ్యం ఓ క్రమంలో ముఖ్యమంగా మారిందని జ్యోతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.