TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడియం శ్రీహరి వర్సెస్ తాడికొండ రాజయ్య

Published on: Sat Feb 18, 2012 4:24PM

వరంగల్లో బస్తీ మేసవాల్  
వరంగల్ జిల్లా :    వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఉప ఎన్నికల వాతావరణం హఠాత్తుగా వేడెక్కింది. టిడిపి, టిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలతో బురదచల్లుకుంటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. కడియం శ్రీహరి తెలంగాణా వ్యతిరేకి అని పార్టీని అడ్డుపెట్టుకుని మంత్రి పదవిని పొంది కొట్లాది రూపాయలు అర్జించాడని టిఆర్ ఎస్ అభ్యర్ధి తాడికొండ రాజయ్య విమర్శలు గుప్పించారు. దీనితో రెచ్చిపోయిన టిడిపి అభ్యర్ధి కడియం శ్రీహరి ఇద్దరి ఆస్తులపై బహిరంగంగా చర్చించుకుందాం రమ్మంటూ  సవాల్ విసిరారు. "మన ఇద్దరి కుటుంబాల ఆస్తులపై బహిరంగ చర్చకు నేను సిద్దం... నీవు కూడా సిద్ధమేనా... సిద్ధమైతేనే మాట్లాడు లేకుంటే నోరు మూసుకో. మన ఇద్దరి ఆస్తులను స్టేషన్ ఖన్ పూర్ నియోజకవర్గ ప్రజలకు రాసిద్దాం, అందుకు నేను సిద్ధం, నీవు సిద్ధమేనా" అని రాజయ్యకు సవాల్ విసిరారు. గతంలోనూ అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు రాకుండా పారిపోయిన పిరికిపందవు, నీకు రాపై ఆరోపణలు చేసే అర్హత ఉందా అని రాజయ్యను కడియం బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలు తెలంగాణా వాదానికి అనుకూలంగా ఉన్నారు తప్ప టిఆర్ ఎస్ అభ్యర్ధి రాజయ్యపై కాదని, రాష్ట్రంలో తక్కువ సమయంలో ఎక్కువ అవినీతి, అక్రమాలకు పాల్పడి చెడ్డపేరు తెచ్చుకున్న వ్యక్తి రాజయ్య ఒక్కడేనని కడియం శ్రీహరి ఆరోపించారు.