'భీమ్లా నాయక్' ట్రీట్‌మెంట్.. ఏం పీకలేవంటూ ద్వారంపూడి కౌంటర్..
Published on: Tue Mar 15, 2022 2:43PM
భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఏం పీకలేరంటూ.. ద్వారంపూడి మరింత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బంతి-చామంతి-అవంతి అంటూ సెటైర్లు వేశారు. డైలాగులు వద్దంటూ అవంతి రివర్స్ అటాక్ చేశారు. ఇలా, ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ వార్ హాట్ హాట్‌గా సాగుతోంది.
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ద్వారంపూడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీకి అలవాటే. నేను భరించాను. కానీ.. నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ద్వారంపూడి కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ ట్రీట్‌మెంట్ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే.. ‘భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్’ అంటే ఏమిటో చూపిస్తాను". అంటూ ద్వారంపూడికి వార్నింగ్ ఇచ్చారు జనసేన.
పీకేకు ద్వారంపూడి సైతం అంతే హార్డ్ రిటార్డ్ ఇచ్చారు. కాకినాడలో మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరంటూ సవాల్ చేశారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పవన్ గుర్తించాలన్నారు. "నా జోలికి వస్తే క్షమించేది లేదు, మేము చూస్తూ ఊరుకొనేది లేదు.. మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చూస్తూ ఊరుకొము. చేతులు ముడుచుకు కూర్చొము. మళ్ళీ చెపుతున్న మమ్మల్ని కాకినాడలో ఒక వెంట్రుక గాని, ఈక గాని పీకలేరు" అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ సైతం పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు.
అటు, మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం పీకేను నిలదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. "పవన్‌కు జడ్జిమెంట్, అసెస్‌మెంట్ తక్కువ. సినిమా కెరీర్‌లో హిట్‌ల కంటే ప్లాప్‌లు ఎక్కువ. మెగాస్టార్ తమ్ముడిననే అహంభావం. జనసేన కార్యకర్తల మీద నేను గూండాగిరి చేశానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? హైదరాబాద్ నుంచి ఏదో టూరిస్ట్‌లా రావడం.. ఎవరో నాలుగు డైలాగ్‌లు రాసిస్తే వాటిని మాట్లాడటం వెళ్లిపోవడం కాదు. బీజేపీను ఏమని రోడ్‌మ్యాప్ అడిగారు? విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయమని అడిగారా? విశాఖకు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అడిగారా?" అంటూ అవంతి శ్రీనివాస్ జనసేనానిని ప్రశ్నించారు.


