అసెంబ్లీ రచ్చ రేపిన....సున్నా వడ్డీ రుణాలు !

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సున్నా వడ్డీ రుణాల విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సున్నా వడ్డీకి రూపాయి కూడా ఇవ్వలేదంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాబు 2011 నుంచి ఉన్న రుణాలను కూడా మాఫీ చేశామని అన్నారు. పాత రుణాలను కూడా బ్యాంకర్లు మాఫీ చేసినట్టు వెల్లడించారని అన్నారు. 

సున్నా వడ్డీపై తన దగ్గరున్న రికార్డ్స్‌ను బయటపెట్టిన చంద్రబాబు.. ప్రజలకు జగన్ ఇప్పుడు సమాధానం చెబుతారా? రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఏమీ తెలియకుండా సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బాబు ఫైర్ అయ్యారు. మొత్తం 930 కోట్లు ఇచ్చినట్లు చెప్పిన బాబు. రూలక్ష వరకూ సున్నా వడ్డీ , లక్ష దాటితే పావలా వడ్డీకి రుణాలు ఇచ్చామని చెప్పారు.  

సున్నా వడ్డీపై సీఎం చాలా ఆవేశంగా మాట్లాడారని, ఇప్పుడేమైనా ఉంటే మాఫీ చేయాలని కోరారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్‌ చేశామని, సీఎం ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చిందని బాబు నిలదీశారు. ‘రాజీనామా చేసి వెళ్లిపోతారా అని అంటున్నారు ? కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చలో గాడిదలు కాశారా అని అంటారా?’ అంటూ మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకంపై అన్ని వివరాలు సభ ముందు ఉంచుతామని.. అప్పుడు సీఎం జగన్‌ రాజీనామా చేస్తారా? క్షమాపణలు చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.