వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీం సంచలన తీర్పు
Published on: Mon Sep 15, 2025 5:45PM
.webp)
వక్ఫ్ సవరణ చట్టం-2025లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధింపు చేసింది. వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలో భాగంగా ‘కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది’ అనే ప్రొవిజన్ ను కేంద్రం ఈ చట్టంలో చేర్చింది.ఈ ప్రొవిజన్ పై సుప్రీం కోర్టు తాజాగా స్పందిస్తూ.. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసే వరకు దీనిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని సెక్షన్లకు కొంత రక్షణ అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్ సీఈవోగా ముస్లిం సభ్యుడే ఉండాలని, మొత్తం సభ్యులలో ముస్లిమేతరుల సంఖ్య ముగ్గురు లేదా నలుగురికి పరిమితం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది


