TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరు కాంగ్రెస్ ఎంపి టిక్కెట్ కు అభ్యర్థులు కావలెను

Published on: Fri Apr 6, 2012 12:21PM

త్వరలో నెల్లూరు లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి విజయావకాశాలు తక్కువగా ఉండటంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధితో సమానంగా ఎన్నికల ఖర్చు పెట్టడం కష్టమన్న భావనతో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి కనీసం రూ. 10 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత ఖర్చుచేసినా ఫలితం ఎలాగూ ప్రతికూలంగానే వుంటుందన్న నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. అయితే మరోవైపు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి పలువురు ఉత్సాహపడుతున్నారు. దీంతో ఇక్కడ ఎవరికీ టిక్కెట్ కేటాయించాలనే విషయంపై స్పష్టత లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయోమయంలో ఉంది.