పెద్దల మాట కొట్టి పడేయకండి.. కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..!
Published on: Thu Jul 30, 2026 3:33PM
పెద్దల మాట కొట్టి పడేయకండి.. కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తే జరిగేది ఇదే..!
.webp)
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేసేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల కారణంగా ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయడం చాలా అరుదుగా మారిపోయింది. పిల్లలు స్కూల్లో, తల్లిదండ్రులు ఆఫీసులలో.. ఇలా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండటం లేదు.. కనీసం రాత్రి సమయంలో అయినా కలిసి భోజనం చేస్తారా అనుకుంటే.. ఒకరు బయట తినేయడం, ఇంకొకరు పార్టీలో తినేయడం, ఇంకొకరు ఆలస్యంగా ఇంటికి రావడం.. ఇలాంటి కారణాల వల్ల కుటుంబంలో అందరూ కలిసి తినే సందర్బం ఉండటం లేదు. అయితే.. పెద్దలు మాత్రం కుటుంబంలో అందరూ కలిసి కనీసం రోజులో ఒకసారి అయినా భోజనం చేయాలని చెబుతారు. అందరూ కలిసి భోజనం చేయడం ఎందుకు ముఖ్యమూ.. తెలుసుకుంటే..
విద్య ఫలితాలు..
అంతా కలిసి భోజనం చేసే కుటుంబాలలో పిల్లలు చదువులో చాలా చురుగ్గా ఉంటారట. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వారిని మానసికంగా మెరుగ్గా ఉంచి, చదువులో మంచి వికాసం కలిగేలా చేస్తుందట. పిల్లలు చక్కగా చదువుకుంటారట.
లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్..
పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేసినప్పుడు పిల్లలలో లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ అవుతాయి. పిల్లలు పెద్దలతో మాట్లాడటం, కావలసినది అడగడం, వద్దని చెప్పడం, వంట బాగుందని చెప్పడం.. ఇలా భోజనం సమయంలో చాలా సంఘటనల నుండి పిల్లలు చక్కగా మాట్లాడటం, చక్కగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు..
పెద్దల సమక్షంలో పిల్లలు భోజనం చేయడం వల్ల పిల్లలు తినే విధానం, ఎలా తినాలి? కావలసిన ఆహారం తినడం, ఆహారం వృధా చేయకపోవడం, శుభ్రంగా తినడం వంటి మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయి. అంతేకాదు.. ఆహారాన్ని కలుపుకునే విధానం కూడా పెద్దల నుండే నేర్చుకుంటారు.
పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు సంపూర్ణ ఆహారం తినే అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, పోషకాలు, ప్రోటీన్.. ఇలా అన్ని రకాలు పిల్లలకు అందుతాయి.
తృప్తిగా తింటారు..
పిల్లలు పెద్దలతో కలిసి తినేటప్పుడు హ్యాపీగా తినడం అలవాటు అవుతుంది. ఇది పిల్లలు తృప్తిగా తినడానికి కారణం అవుతుంది.
సెల్ఫ్ రెస్సెక్ట్, సెల్ఫ్ కాన్పిడెన్స్..
పెద్దల దగ్గర కూర్చుని పిల్లలు తామే ఆహారం కలుపుకోవడం, తినడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి.
బందాలు..
పిల్లలు, పెద్దలు కలిసి భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా మారుతుంది. అందరూ కలిసి తినే ఆ కొద్ది సమయం అందరినీ కలిపి ఉంచుతుంది.
ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్..
ఒంటరిగా తినేటప్పుడు కోపం, డిప్రెషన్, ఒత్తిడి వంటి ఎమోషన్స్ తో తినే అవకాశం ఉంటుంది. పైగా ఒంటరిగా తినేటప్పుడు ఒంటరితనం కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుంది. కానీ అందరూ కలిసి తింటే.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి ఉండవు.
చెడు అలవాట్లు..
ఒక వయసులోకి వచ్చిన పిల్లలు చాలా వరకు మధ్యం సేవించడం, స్మోక్ చేయడం, డ్రగ్స్ వాడటం వంటివి చేసే అలవాటు ఉంటుంది. కానీ అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తే పిల్లలలో చాలా వరకు మానసిక మార్పు కలుగుతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండగలుగుతారు.
ఆరోగ్య సమస్యలు..
అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. ఎక్కువ ఆహారం తినవద్దని, ఎక్కువ ఉప్పు, కారం వంటివి తినవద్దని ఒకరికి ఒకరు సలహా ఇచ్చుకోవడం లేదా జాగ్రత్తలు చెప్పడం లాంటివి జరుగుతాయి. దీని వల్ల ఒబెసిటీ, దీనికి సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
*రూపశ్రీ.


