TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖలో గోడకూలి ముగ్గురి మృతి

Published on: Thu Sep 18, 2014 10:44AM

 

విశాఖపట్నంలో గోడ కూలిన సంఘటనలో ముగ్గురు మరణించారు. విశాఖలోని వీఐపీ రోడ్డులో వున్న టైకూన్ హోటల్ దగ్గర గురువారం ఉదయం గోడకూలింది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానల వల్ల బాగా నానిపోయిన గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గోడ శిథిలాల కింద మరో ఇద్దరు ఉన్నారని తెలుస్తోంది. వారిని వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.