ఒక పరాజయం 100 తప్పులు.. బాబుని కార్యకర్తలకు దూరం చేసింది ఆ 'చౌదరే'నా?

 

మన దగ్గర ఏమీ లేనప్పుడు అందరితో మంచిగా ఉండటం గొప్ప కాదు.. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరితో ఉండటం గొప్ప. అలాగే రాజకీయాల్లో.. పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలతో మంచిగా ఉండటం గొప్పకాదు, పార్టీలో తగిన గుర్తింపు వచ్చి మంచి స్థాయికి వెళ్ళాక కూడా కార్యకర్తలతో మంచిగా ఉండటం గొప్ప. ఇది లేకనే టీడీపీలో ఒక నేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ రకంగా టీడీపీ ఓటమికి కూడా కారణమయ్యారు. ఆయనే టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ వీవీ చౌదరి.

వీవీ చౌదరి అప్పట్లో తెర వెనుక నుండి టీడీపీ కోసం క్రియాశీల కార్యకర్తగా తన వంతు కృషి చేసారు. మరి ఈయన బాబు తనయుడు లోకేష్ దృష్టిలో ఎలా పడ్డారో తెలీదు కానీ.. ఆయనకు బాగా దగ్గరయ్యారు. ఎంతలా అంటే ఫోను చేసి స్వేచ్ఛగా మాట్లాడే అంత. తరువాత పార్టీ ఆఫీస్ లో కూడా వీవీ చౌదరి హవా కొనసాగింది. ఆయన హవానే నిజమైన కార్యకర్తలను పార్టీకి దూరమయ్యేలా చేసింది. దురుసుగా ప్రవర్తించడం, ఎవర్ని లెక్క వేయకుండా మాట్లాడం, కార్యకర్తలు ఏదైనా సమస్యను పార్టీ దృష్టికి తీసుకొస్తే పట్టించుకోకపోవడం. ఇలా సొంత పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు. పార్టీలో అంతా నేనే అన్నట్లుగా లోకేష్, బాబులకు దగ్గరైన ఈయన.. కార్యకర్తలను దూరం చేసాడు. దీన్ని గుర్తించడంలో బాబు విఫలమయ్యారు. అందుకే ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారు.