జగన్ ను వెంటాడుతున్న ఉండవల్లి
Published on: Fri Jun 1, 2012 11:58AM
ఈనాడు రామోజీరావుకు రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు వింటేనే హడల్! మార్గదర్శి అక్రమాలపై గలం విప్పిన ఆయన ఆ తరువాత మౌనముద్రను దార్చారు. అడపాదడపా మాటలే కానీ, అంతగా ఎవరిపైనా ఆగ్రహాన్ని చూపలేదు. తాజాగా అరుణ్ కుమార్ జగన్ అక్రమాస్తుల వ్యవహారం గురించి ప్రస్తావించారు. గతంలో వై.ఎస్.కు స్వామి భక్తుడులాంటి అరుణ్ కుమార్ ఇప్పుడే ఎందుకు జగన్ పై, ఆయన తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిపై దుమారం లేపుతున్నారు? దీనికేమైనా ప్రత్యేక కారణం ఉందా? అన్నదే ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే జగన్ పై సూటిగా విమర్శనాస్త్రాలను ఆయన సంధించారు. ప్రజా ఆస్తులు కాబట్టి జగన్ అసలు ఇన్ని కోట్లు ఎలా కూడబెట్టావు అని ప్రశ్నించటానికి అందరికీ హక్కుందన్నారు. అంతే కాకుండా వై.ఎస్. హయాంలో జరిగిన అవినీతి కాబట్టి జగన్ తన అక్రమార్జనకు లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లాజిక్కులు తీయటంలో అరుణ్ కుమార్ బాణీ ఎవరికీ రాదని గతంలో రాజీవ్ గాంధీ వంటి నేతలు కూడా ప్రశంసించారు ఆయన్ని. కానీ, ఇన్నాళ్ళ తరువాత వై.ఎస్. జగన్ గురించి అరుణ్ కుమార్ మాట్లాడటం రాజమంద్రిల్ తీవ్రచర్చనీయాంశమైంది.


