Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విడదల రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్
posted on: May 10, 2025 3:58PM

మాజీ మంత్రి విడదల రజిని ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు. రజిని కారులోనే మానుకొండ తిరుగుతున్నాడని పోలీసులకి పక్కా సమాచారంతో మాజీమంత్రి కారులోనే నాదెండ్ల మండలం జంగాలపల్లికి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. ఆయను అరెస్ట్ చేయొద్దని పోలీసులని రజిని అడ్డుకున్నారు. అతికష్టం మీద వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి విడదల రజినీకి వాగ్వాదానికి దిగింది. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా విడుదల రజిని డిమాండ్ చేశారు. ఇప్పటికే రజినిపై ఏసీబీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. వైసీపీ హయంలో పల్నాడు జిల్లాలో.. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని.. బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని రజినీపై ఆరోపణలు వచ్చాయి. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు అయింది.



.webp)


