TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వం ఫై ధ్వజమెత్తిన నారాయణ

Published on: Wed Dec 21, 2011 12:21PM

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా మద్దెలపాలెంలోని ఆబ్కారీ కార్యాలయం వరకు నారాయణ ఆధ్వర్యంలో సిబిఐ కార్యకర్తలు  ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం బందిపోటులా పనిచేస్తోందని అయన  వ్యాఖ్యానించారు. అవినీతి నిరోధక శాఖ  పట్టుకున్న మద్యం మాఫియా జాబితాను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల కుంభకోణాన్ని సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మద్యం సిండికేట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

మద్యం సిండికేట్ల కుంభకోణంలో ముఖ్యమంత్రికి కిరణ్ కుమార్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. మంత్రులు కూడా ఇందులో పాలు పంచుకున్నారని, అందుకే మద్యం మాఫియా జాబితాను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో అధికారులు కూడా భాగస్వాములై దోచుకుంటున్నారని ఆయన అన్నారు. మద్యం మాఫియాపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఆయన హెచ్చరించారు. పదవిని కాపాడుకోవడానికే ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. సమాంతర ప్రభుత్వాన్ని మద్యం మాఫియా ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు.