TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశ్వరూపం డీటీహెచ్ కంటే ముందే...

Published on: Wed Jan 9, 2013 3:12PM

 

 

 Viswaroopam release postponed, Viswaroopam release, Viswaroopam release date, Viswaroopam DTH release

 

 

నెల రోజుల నుంచి డీటీహెచ్ లలో విడుదల కావడం గురించి వార్తల్లో నిలుస్తూ సంచలనంగా మారిన విశ్వరూపం సినిమా విడుదలకు ముందే కష్టాలను ఎదుర్కొంటుంది. ఈ నెల 11 న విడుదల కావాల్సిన విశ్వరూపం సినిమా విడుదల వాయిదాపడింది ఈ చిత్రానికి థియేటర్లు దొరకక పోవడం వల్ల విడుదల వాయిదాపడినట్లు తెలుస్తోంది.


ఇక మరో విశేషం ఏంటంటే..ఈ సినిమా డీటీహెచ్ విడుదలను కూడా వాయిదా వేశారు. కమల్ హాసన్, తమిళనాడు థియేటర్ల ఓనర్ల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు సినిమాను జనవరి 25న విడుదల చేయాలని, సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు రోజుల తర్వాత(జనవరి 28న) డిటిహెచ్ ద్వారా సినిమాను నేరుగా టీవీల్లో ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని ఇరు వర్గాలు ఆమోదించాయి. దీంతో వివాదం కాస్త సద్దుమనిగినట్లయింది.