విశ్వవిజేత ఓడిపోయాడు

 

13 సంవత్సరాలుగా తన కిరీటాన్ని కాపాడుకుంటూ వస్తున్న చెస్‌ చాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనంద్‌ చివరకు తలవంచాడు. 5 సార్లుగా వరుసగా టైటిల్స్‌ సాదిస్తున్న వచ్చిన ఆనంద్‌ ఈ సారి మాత్రం తన కిరీటాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు.

ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు.