TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలోకే చెత్త ముఖ్యమంత్రి!.. జ‌గ‌నన్న‌కు ఈసారి 20 సీట్లు కూడా రావా?

Published on: Fri Apr 1, 2022 3:07PM

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుతో అన్ని వ‌ర్గాల నుంచీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో క‌రెంట్ ఛార్జీలు బాదుడే బాదుడే అంటూ జ‌గ‌న్ చేప్పిన డైలాగులు తెగ వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలోనైతే నెటిజ‌న్లు జ‌గ‌న్‌రెడ్డిని ఓ ఆటాడుకుంటున్నారు. అప్పుడు-ఇప్పుడు అంటూ జ‌గ‌న్ డైలాగ్స్‌ను ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. 

తాజాగా, బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఇంత చెత్త ముఖ్యమంత్రి ఎవ‌రూ లేర‌ని, ఇంత‌టి నియంతృత్వ పాలన ఎక్కడ లేదన్నారు. విద్యుత్ ఛార్జీలపై గతంలో బాదుడే.. బాదుడే అంటూ స్లోగన్స్ ఆయనకే వర్తిస్తాయని.. ఇప్పుడు ప్రజలకు వాతలే.. వాతలు అంటూ మండిప‌డ్డారు. 

జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచి ఉగాది కానుక ఇచ్చారని.. మరో రెండేళ్లలో జగన్‌కు ఇంటికి పంపించి ప్రజలు గిఫ్ట్ ఇస్తారని విష్ణుకుమార్‌రాజు అన్నారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు వెళితే.. వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా రావంటూ విమ‌ర్శించారు.

ఇల్లు, రేషన్ కార్డు, పథకాలు కట్ చేస్తారనే భ‌యంతో ప్రజలు తమ అభిప్రాయాలు బయటకు చెప్పడం లేదని అన్నారు. ‘‘నేను కూడా మెడలో కండువా లేకపోతే.. జగన్ గెలుస్తాడని చెబుతాను. కండువా మాకు శ్రీరామ రక్ష.. లేదంటే నాకు కూడా పోలీసులతో కుమ్ముడే కుమ్ముడు’’ అంటూ విష్ణుకుమార్‌రాజు ఎద్దేవా చేశారు. 8 మంది ఐఏఎస్‌లకు న్యాయమూర్తి కనికరించి వదిలేశారు లేదంటే వారి జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. అధికారులు అంత లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు.

చెత్త ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు వాస్తవమే అన్నారు. షర్మిళ, విజయమ్మ చేసిన పాదయాత్రలు, మాజీ సీఎం వైఎస్సార్ కూమారుడు కావడం వల్లే జగన్ ముఖ్య‌మంత్రి అయ్యారని అన్నారు. జగన్ ఇక రెండు సంత్సరాలు మాత్రమే ఉంటారని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.