గున్నీకి బెయిల్ వస్తుందా? రాదా?
Published on: Wed Sep 25, 2024 12:25PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై సినీ నటి జిత్వానీ కేసులో సస్పెండైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఈ రోజు విచారణకు రానుంది. అలాగే అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏ1గా ఉన్న జోగి వేంకటేశ్వర రావు వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న జోగి వేంకటేశ్వర రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.


