TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ వన్డే పై కాంగ్రెస్‌లో వార్

Published on: Fri Nov 8, 2013 6:55AM

 

ఈ నెల 24 న ఇండియా వెస్టిండీస్‌కు మధ్యజరగనున్న వన్‌ డే మ్యాచ్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆదిపత్యపోరుకు తెరతీసింది. విశాఖలో జరగనున్న ఈ మ్యాచ్‌ విషయంలో అదే జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యులు కత్తులు దూసుకుంటున్నారు.

 

ప్రస్తుతం విశాఖ జిల్లాలో సమైక్య పోరు ఉదృతంగా సాగుతున్న నేపధ్యంలో మ్యాచ్ జరపొద్దంటూ బీసీసీఐ కి లేఖ రాయాలని మంత్రి గంటా కలెక్టరును కోరారు అంతేకాదు స్వయంగా తానే మ్యాచ్‌ను అడ్డుకుంటానంటూ బహిరంగంగానే హెచ్చరించారు.

 

అయితే గంట వ్యాఖ్యలకు ఆయన రాజకీయ ప్రత్యర్థి గళం విప్పారు.  ఆరు నూరైనా విశాఖలో మ్యాచ్‌ జరిగి తీరుతుందని మంత్రి బాలరాజు ప్రకటించారు. మ్యాచ్ రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయాల్సిన అవసరం లేదన్నారు. మ్యాచ్‌ను అడ్డుకుంటే విశాఖ ఖ్యాతిని దిగజార్చినట్టే అవుతుందని పరోక్షంగా గంటను విమర్శించారు.