జగన్ హయాంలో విశాఖ పట్నం విషాదపట్నం అయిపోయింది..నారా లోకేష్
Published on: Wed Aug 3, 2022 11:17AM
సముద్ర తీరాన ప్రశాంత నగరం విశాఖపట్నం జగన్ హయాంలో విషాదపట్నంగా మారిపోయిందని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే రెండు పర్యాయాలు గ్యాస్ లీకేజ్ సంఘటనలు జరిగినా ప్రభు త్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రజల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేకుండా పోయిందని విమర్శించారు.
భూకబ్జాలు, దౌర్జన్యాలతో పాటు విష రసాయనాల లీకులతోనూ విశాఖ ప్రజలు ప్రాణభీతితో బతకాల్సిన పరిస్థితిని జగన్ సర్కార్ కల్పించిందని విమర్శించారు. ఎల్జీపామర్స్, సాయినాథ్ ఫార్మా విషాదం ఇంకా మరవక ముందే అచ్యు తాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో మూడో సారి విషవాయువులు లీక్ కావడం మహిళలు తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఆందోళనకలిగించిందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే కమీషన్ల మీదే ఆసక్తి ఉందని టీడీపీ నేత మండిపడ్డారు. చనిపోయాక నష్టపరిహారం ప్రకటించడం కంటే వారి ప్రాణాలను కాపా డేందుకు ముందు జాగ్రత్తల మీద ప్రభుత్వం దృష్టిపెట్టలేకపోవడం దురదృష్టమన్నారు.
ఎల్జీ పాలీమర్స్ మరణమృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే, అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువులు లీకై వందల మంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురికావడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వా లేదు... కమీషన్ల పైనే వైసీపీ దృష్టి ఉందని ఆయన మండి పడ్డారు. చనిపోయాక పరిహారం ఇవ్వడం గాకుండా వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా, అనకాపల్లి బ్రాండిక్స్‌లో రసాయన వాయువు లీక్‌తో అస్వస్థతకు గురైన మహిళలకు వేగంగా వైద్యం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రెండు మాసాల వ్యవధిలో మూడు పర్యాయాలు రసాయనాలు లీక్ అయ్యాయన్నారు. ప్రభుత్వం తోలు మందంగా వ్యవహ రిస్తోందని ఆయన విమర్శించారు. పరిశ్రమల పై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా? అని ప్రశ్నిం చారు. కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ సోమువీర్రాజు విసుర్లు విసిరారు. స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అత్యవసర ప్రకటన విడుదల చేశారు.
విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైన ఘటనలో 50 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థ తకు గురయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచనాలు చేసుకుని స్పృహ తప్పి పడిపో యారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రులకు తర లించింది. మంగళవారం అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ అపెరిల్ సిటీ పరిధిలోని క్వాంటామ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు కంపెనీ ని మూసేశారు. ఇటీవలే కొన్ని షరతులతో కంపెనీని తెరుచుకోవచ్చని పొల్యూషన్ బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరోసారి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. గ్యాస్ లీక్ సంఘటన జరిగిన సమయంలో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటు న్నారు.


