TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖలో గూగుల్ ... కొత్త యుగానికి పునాది : జీత్ అదానీ

Published on: Tue Apr 28, 2026 4:35PM

 

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు.  భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖపట్నం నూతన ద్వారంగా ఎదుగుతోందన్నారు. వైజాగ్‌లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ.. ఈ మూడు కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దాన్ని ముందుకు నడిపించే దేశాలు.. టెక్నాలజీని మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టే శక్తిమంతమైన వ్యవస్థలను నిర్మించాలన్నారు. 

ఈ అవకాశానికి విశాఖ కేంద్రబిందువుగా నిలుస్తోందని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఖర్చు అంటే పవర్ ఖర్చేనని, ఇదే భారతదేశానికి ఉన్న గొప్ప ప్రయోజనమని జీత్ అదానీ అన్నారు. ఈ రంగంలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా భారత డిజిటల్ గేట్‌వేలు ముంబై, చెన్నై వరకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. కానీ ఇప్పుడు విశాఖ ఒక కొత్త అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా అవతరిస్తోందని వ్యాఖ్యానించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఎనర్జీ ద్వారా కంప్యూట్ వ్యయం తగ్గి, ఆపై ఇంటెలిజెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు అవకాశాలు విస్తరిస్తాయని జీత్ అదానీ పేర్కొన్నారు