TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖపట్నంలో దొంగనోట్ల ముఠా అరెస్టు

Published on: Thu Mar 2, 2017 4:11PM

విశాఖలో దొంగనోట్ల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కొందరు ఒక ముఠాగా ఏర్పడి రూ.2000, రూ.500, రూ.100 నోట్లను ముద్రించి సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో వీరి స్థావరంపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7 లక్షల 33 విలువగల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.