TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ టీచర్లు ఏంటో ?

Published on: Mon Nov 3, 2025 10:30AM

 

దైవంతో సమానంగా భావించే పరిస్థితి నుంచి కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. అందులో మహిళా టీచర్లు ప్రమేయం ఉండడం బాధాకరమైన విషయం ఇప్పుడు సమాజం ఇలాంటి ఉపాధ్యాయుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది విశాఖలోని సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని సాయి తేజ ఎందుకు అకాల మరణం చెందరన్న విషయంపై విద్యార్థులు ఆందోళన చెందారు కారణాలు అన్వేషించారు. అయితే అతని స్నేహితులు ఇచ్చిన సమాచారంతో మొబైల్ డేటాను పరిశీలించారు అందులో ఊహించని నమ్మలేని నిజాలు కనిపించాయి. ఆ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు సాయి తేజ తో విభిన్నంగా చాటింగ్ చేశారు. 

అందులో ఒకరు సన్నిహితం అవ్వాలన్న ప్రయత్నం చేస్తే మరొకరు ఆ విషయాన్ని తెలుసుకొని బ్లాక్మెయిలింగ్ చేశారు. అలా ఇద్దరు టీచర్ల విభిన్న ఒత్తిడితో సాయి తేజ మానసికంగా దిగులు చెందాడు. అందుకే అతను ప్రాణం తీసుకున్నాడాని కుటుంబ సభ్యులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు మహిళ టీచర్లను వెంటనే అరెస్ట్ చేయాలని సాయి తేజ కుటుంబ సభ్యులు కాలేజీ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. 

ఈ విషయం ఇప్పుడు నెటిజన్లలో చర్చగా మారింది విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఈ రకంగా ప్రేమ వ్యామోహం తో డిగ్రీ విద్యార్థిని మానసికంగా వేధించడం సరికాదంటున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో బయటికి వచ్చినప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు ఆపోజిట్ సెక్స్ విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పురుష టీచర్లు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది కానీ ఇప్పుడు విశాఖలోని సమతా కాలేజ్ వ్యవహారంలో మహిళ టీచర్ల తప్పుడు ప్రవర్తన గాడి తప్పిన సమాజానికి ఒక చిరునామాగా చెప్పుకుంటున్నారు