ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్
Published on: Sun Oct 12, 2025 11:51AM
.webp)
విశాఖలో ఏఐ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. నాస్ డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను సిఫీ అభివృద్ధి చేయనుంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా విశాఖ మారనుంది


