డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Published on: Fri Aug 29, 2025 4:54PM

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో డబుల్ డెక్కర్ బస్సులను విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భారత్‌కు టెక్నాలజీ హబ్‌గా వైజాగ్ నగరం ఎదుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పర్యాటకులు విశాఖను పర్యావరణరహితంగా మార్చాలి తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం కోరారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వైజాగ్‌లో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తామని.. ఈ కేబుల్ ద్వారా ఈ నగరంతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందని తెలిపారు. అలాగే మహిళలకు సురక్షితమైన నగరంగా వైజాగ్ ఎంపికైందని గుర్తు చేశారు. ఈ విశాఖ నగరం.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోటీ పడుతోందని వివరించారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని.. ఇది మనమంతా గర్వపడే అంశమని సీఎం తెలిపారు. హాప్ ఆన్ హాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కి.మీ మేర పరుగులు పెట్టనున్నాయి. రూ. 250తో రోజాంతా ప్రయాణించవచ్చు.


