విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్
Published on: Thu Aug 28, 2025 10:00PM

ఏపీకి మరో భారీ పెట్టుబడికి సిద్దమైంది. విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఈ సెంటర్ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది. మూడు సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా వైజాగ్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ రూపుదిద్దుకోనుంది.
విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఇది గ్రీన్ ఎనర్జీ వినియోగంతో ఒక గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. హౌసింగ్ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (AI) హబ్‌ల ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది.హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖపట్నం మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో ఈ డేటా సిటీని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.


