ప్రజల సహకారంతో యోగాంధ్ర విజయవంతం : సీఎం చంద్రబాబు

 

ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాల సహకారంతోనే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్‌కు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహాకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని అందుకు ప్రకృతి కూడా సహరించిందని తెలిపారు. 

సూర్య నమస్కారాతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని.. యోగాంధ్ర సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చింది మోడీనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్‌ తీసుకొస్తామని.. యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు.యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు.

కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. "ఇలాంటి భూతాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం" అని చంద్రబాబు తెలిపారు. విశాఖకు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. మంచి పని చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యనించారు. యోగా డే వేడులకు ఒక్క పిలపునిస్తే.. లక్షల్లో జనం తరలివచ్చారని అన్నారు. విశాఖ ప్రజలది పాజిటివ్ థింకింగ్ అని.. సమైక్యతా భావం ఎక్కువని కితాబిచ్చారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu