TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రో కారిడార్ తో తీరప్రాంతానికి ముప్పు

Published on: Tue Feb 21, 2012 9:52AM

విశాఖ: విశాఖ, కాకినాడ తీరప్రాంతం మధ్య వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఏర్పాటు చేయదల్చుకున్న పెట్రో కారిడార్ వల్ల ఆ ప్రాంతం తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్రో కారిడార్ ఏర్పాటువల్ల సుమారు 10వేల మత్స్యకార కుటుంబాలు నిరాశ్రయమవుతాయి. అంతేకాక పెట్రోకారిడార్ లో ఏర్పాటు చేసే వివిధ యూనిట్ల వల్ల వెలువడే వ్యర్ధాలు తీరప్రాంత జలాలను కలుషితం చేస్తాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు. దీనివల్ల సముద్ర జలాల్లోని జీవరాసులు అంతరించిపోయే ప్రమాదం ఉందని, తీరప్రాంతమంతా విషవాయువులు కమ్ముకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోకారిడార్ కోసం వేలాది ఎకరాలను పలు ప్రైవేట్ కంపెనీలు ధారాదత్తం చేశాయి. కొన్ని కంపెనీలయితే ఇప్పటికే తీరప్రాంతంలో మకాం పెట్టాయి. యూనిట్లను ఏర్పాటు చేయనప్పటికీ తమ స్థలాల్లో పెన్సింగ్ లు వేసి మత్స్యకారుల రాకపోకలకు అడ్డు తగులుతున్నాయి.