TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రంగురాళ్ళపై రాజకీయ వారసుల చూపు

Published on: Fri Feb 17, 2012 10:25AM

విశాఖ:    విశాఖ జిల్లా కరక రంగురాళ్ళ క్వారీ లీజు పొందేందుకు పలువురు నేతల కుమారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కరక రిజర్వు ఫారెస్ట్ లో ఉన్న సుమారు 480 హెక్టార్ల రంగురాళ్ళ క్వారీని రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రి తనయుడు, జిల్లాకు చెందిన మాజీమంత్రి తనయుడు హస్తగతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరక రంగురాళ్ళ క్వారీ 1994లో బైటపడటంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు వ్యాపారులు కోట్లాది రూపాయల వ్యాపారం సాగించారు. 1994  నుంచి 2005 వరకు తవ్వకాలు సాగించి సమీప గ్రామాల ప్రజలతోపాటు నర్సీపట్నానికి చెందిన పలువురు వ్యాపారులు కోట్లకు పడగలెత్తారు. ఈ క్వారీలో అత్యంత విలువైన ఎల్ ఎక్స్ రకం రాళ్ళు దొరకడంతో వీటి విలువ కోట్ల రూపాయలు ఉండటంతో అందరి దృష్టి ఈ క్వారీపై పడింది. ప్రస్తుతం ఈ రంగురాళ్ళ క్వారీ రిజర్వు ఫారెస్ట్ లో ఉండటంతో ఫారెస్ట్ శాఖ అనుమతికోసం ఈ ఇద్దరు వారసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్వారీ తమకే లీజుకు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. అలా కాకుండా బయటి వ్యక్తులకు లీజుకు ఇస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.