TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ ఎవరికీ?

Published on: Fri Feb 17, 2012 9:29AM

పురంధేశ్వరి వర్సెస్ సుబ్బరామిరెడ్డి
విశాఖపట్నం: విశాఖ లోక్ సభ టిక్కెట్ కోసం ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడైన టి.సుబ్బరామిరెడ్డి తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో విశాఖనుంచి పోటీ చేస్తానని, ప్రస్తుత ఎంపి అయిన పురంధేశ్వరి వేరే చోటనుంచి పోటీచేయాలని సుబ్బరామిరెడ్డి ఓపెన్ గానే చెప్పారు. దీనిపై పురంధేశ్వరి కామెంటేమీ చేయలేదు.ఆమె కేంద్ర మంత్రిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కానీ సుబ్బరామిరెడ్డి మాత్రం తన పట్టు వీడటం లేదు. ఈ సారి తన సన్నిహితుల ద్వారా విశాఖ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ ప్రకటనలు చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ నగరాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న రాజ్యసభసభ్యుడు సుబ్బరామిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ టిక్కెట్ ఇవ్వాలంటూ గాజువాక పట్టణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్టీ సభ్యుడు  తిప్పల చినఅప్పారావు, గొల్లవిల్లి రాంబాబు, చీకటి పైడిరాజు, ఊరుకుడి అప్పలనాయుడు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి మరీ సుబ్బరామిరెడ్డికి మద్దతు ప్రకటించారు. 1980 నుంచి విశాఖ నగర, జిల్లా ప్రజానీకానికి అందుబాటులో ఉండి ఆయన ఎన్నో సేవా కార్యక్ర్తమాలు చేపట్టారని వారు కొనియాడారు. రెండు పర్యాయాలు విశాఖ ఎంపీగా ఎన్నికైన సుబ్బరామిరెడ్డి విశాఖను అంచెలంచలుగా అభివృద్దిచేశారని కొనియాడారు. ఇదిలాఉండగా పురంధేశ్వరికి విశాఖలో పెద్దగా కేడర్ బలంగాని, నాయకుల మద్దతుగాని లేదు. అయితే అధిష్టానం మద్దతు మాత్రం ఆమెకు పుష్కలంగా ఉంది. ఈ ధీమాతోనే ఆమె విశాఖ టిక్కెట్ మళ్ళీ తనకే వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది.