TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మన్యం కాఫీకి మావోయిస్టుల ఆంక్షలు

Published on: Mon Feb 13, 2012 2:42PM

విశాఖపట్నం: విశాఖ జిల్లా దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని మన్యసీమలో కాఫీ పంటను సాగుచేసే రైతులపై మావోయిస్టులు ఆంక్షలు విధించారు. కాఫీపంటను ఎవరికీ అమ్మవద్దంటూ రైతులకు ఫర్మానా జారీ చేశారు. అలాగే తము చెప్పేంత వరకూ కాఫీ పంట కొనుగోలు చేయరాదని వ్యాపారులందరికీ మావోయిస్టులు వ్యక్తిగతంగా లేఖలు పంపారు. దీంతో వారు వ్యాపార లావాదేవిలను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటను ఎవరికీ అమ్ముకోవాలో తెలియని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు.

 

మన్యం కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు మన్యంలో  ఐదేళ్ళ వ్యవధిలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు విస్తరణకు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. దీనిని ఉపాధి హామీ పధకం  కింద చేట్టారు. మన్యసీమలో ఎపిఎఫ్డిసి కూడా 10వేల ఎకరాల్లో కాఫీ సాగుచేస్తోంది. ఏటా సుమారు వెయ్యిటన్నుల కాఫీ గింజలను ఈ సంస్థ ఉత్పత్తి చేసి విజయవాడ, బెంగుళూరు. ఢిల్లీ ప్రాంతాల్లో విక్రయిస్తోంది. అయితే గిరిజన రైతులకు మాత్రం ఈ తరహా వ్యవస్థ అందుబాటులో లేదు. వీరు దళారులు. వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయినకాడికి అన్నట్టు అమ్ముకోవడంతో గిట్టుబాటుధర కూడా రావడం లేదు. దీనికి తోడు మావోయిస్టుల ఆంక్షలతో ఈ గిరిజన రైతులు విలవిల లాడుతున్నారు. గిరిజన రైతులకు మంచి రేటు ఇప్పించేందుకే తాము ఈ ఆంక్షలు పెట్టినట్లు మావోయిస్టులు అంటున్నారు. అయితే మావోయిస్టులు నిర్ణయించే రేటుకు కాఫీని కొనుగోలు చేయడానికి దళారులు, వ్యాపారులు ముందుకు రాకపోతే గిరిజనుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారవుతుంది.