TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్కే బీచ్‌లో గల్లంతైన యువకుడిని కాపాడిన లైఫ్‌గార్డ్..!

Published on: Sun Aug 30, 2026 1:23PM

 

అలలతో ఆటలు..యువకుడిని ఈడ్చుకెళ్లిన రాకాసి అలలు..! 

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సరదాగా సముద్రంలోకి దిగిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. భారీ అలలు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఈశ్వరరావు అనే యువకుడు సముద్రంలో చిక్కుకుపోయాడు. అలల ఉద్ధృతికి అతడిని సము ద్రంలోపలికి ఈడ్చుకెళ్లడంతో అక్కడున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సముద్రం వద్ద నిలబడిన ఈశ్వరరావు అలలతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ అలలు దూసుకొచ్చాయి. 

వాటి ధాటికి అతడు అదుపుతప్పి లోతువైపు కొట్టుకుపో యాడు. క్షణాల్లోనే ఈశ్వరరావు సముద్రంలో కనిపించకుండా పోవడంతో అక్కడ ఉన్న వారు గట్టి గట్టిగా అరుస్తూ భయ భ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనిం చిన  లైఫ్‌గార్డ్స్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగారు. సముద్ర అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. అలల మధ్య లోకి వెళ్లి ఈశ్వరరావును గుర్తించి అతడిని పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. 

లైఫ్‌గార్డ్స్‌ సకాలంలో స్పందించడంతో ఈశ్వర రావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీంతో అక్కడున్న సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సము ద్రంలో అలలు ఉద్ధృతంగా ఉన్న సమయంలో సందర్శకులు నీటిలోకి దిగవద్దని లైఫ్‌గార్డ్స్‌ సూచిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ సిబ్బంది హెచ్చ రికలను పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.

 

Visakha RK Beach, Iswara Rao, Lifeguards, Rescue operation, CM Chandrababu, Naralokesh, Home minister anitha, Telugu One, Telugu news