TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనకాపల్లిలో గంట మోగిస్తున్న మంత్రి బంధువు

Published on: Wed Mar 28, 2012 10:31AM

విశాఖ సమీపంలోని అనకాపల్లి పట్టణాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువయిన పరుచూరి భాస్కర్ శాసిస్తున్నారు. భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఆయనకు ఎటువంటి అధికార పదవీ లేదు. అయినా అధికారులపైనా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలపైనా పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారులు తన చెప్పుచేతల్లో ఉండాలని ఆదేశాలు జారీచేయడమే కాకుండా వారితో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రి శ్రీనివాసరావు తనను అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించినట్లు పరుచూరి భాస్కర్ చెబుతున్నారు. గతంలోనూ ఈ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉండేది. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సోదరుడు రఘు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. అధికారులను హడలెత్తించారు. ఇప్పుడు అనకాపల్లిలో మంత్రి గంటా శ్రీనివాసరావు పేరుతో భాస్కర్ పెత్తనం చెలాయిస్తున్నారు. భాస్కర్ పెత్తనాన్ని సహించలేని కొందరు అధికారులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.