గంటా దూకుడుతో బాలరాజు బెంబేలు
Published on: Sat Mar 17, 2012 2:53PM
విశాఖజిల్లా నుంచి రాష్ట్రమంత్రులుగా ఉన్న పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఇప్పుడు పోటీ వాతావరణం నెలకొని వుంది. జిల్లాపై ఆధిపత్యానికి వీరిద్దరూ పోటీపడుతున్నారు. పోటాపోటీగా అధికారులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. వీరి పోటీ సర్వత్రా ఆసక్తిగా మారింది. బాలరాజు సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాల్లోగాని, అధికార యంత్రాంగంపైగాని పట్టు సాధించుకోలేకపోయారు. అయితే ఇటీవలే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో దూసుకుపోతూ బాలరాజును బెంబేలెత్తిస్తున్నారు. పాయకారావుపేట ఉప ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు గంటా శ్రీనివాసరావు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ఖర్చు, గెలుపు బాధ్యతలను తానే తీసుకుంటానని గంటా శ్రీనివాసరావు పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన బాలరాజు వచ్చే ఉప ఎన్నికల్లో ఉనికి కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.


