TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్ట్రేలియా తో టెస్ట్: సెహ్వాగ్ అవుట్, రహానే ఇన్

Published on: Thu Mar 7, 2013 1:53PM

 

 

Virender Sehwag dropped from Indian Test team,  Virender Sehwag dropped from Indian squad

 

 

ఆస్ట్రేలియా తో జరగనున్న మూడో,నాల్గో టెస్టు కు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అనుకున్నట్లు గానే సెలక్టర్లు సెహ్వాగ్ పై వేటు వేశారు. భారత జట్టులో సెహ్వాగ్ కు స్థానం దక్కలేదు. సెహ్వాగ్ స్థానం లో రహానే కు జట్టులో చోటు లభించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటికే ఇండియా రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను భారత్ వశం అవుతుంది.


గత సంవత్సరం అహ్మదాబాదులో ఇంగ్లాండు పైన ఒక సెంచరీ మినహా బాగా ఆడలేదు. ఇప్పటికి సెహ్వాగ్ ఫాం చాలా గోరంగా ఉంది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటి వరకు సెహ్వాగ్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్సులలో అతని పరుగులు అంత తక్కువ ఉండటం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.


భారత్ జట్టు : ఎమ్మెస్ ధోనీ(సారథి), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, సచిన్ టెండుల్కర్, రవీంద్ర జడెజా, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ప్రజ్ఞాన్ ఓఝా, అజింక్యా రహానే, హర్బజన్ సింగ్, ఆర్ అశ్విన్, అశోక్ దిండా