TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అర్ధ్రరాత్రి సెహ్వాగ్ ఫ్రెండ్ చేసిన పని...

Published on: Wed Mar 15, 2017 6:05PM

 

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సరదాగా ట్వీట్స్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటాడు. ఇప్పుడు తాజాగా మరో విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు సెహ్వాగ్. అదేంటంటే.. ఓరోజు సెహ్వాగ్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడంటా.. అయితే ఆ రోజు రాత్రి 11:45గంటల సమయంలో ఇంట్లోని వంట గదిలో నుంచి ఏదో చప్పుడు అవుతున్నట్టు వినిపించడంతో అక్కడి వెళ్లిన చూశాడంటా. అయితే ఆ సమయంలో సెహ్వాగ్ ఫ్రెండ్ బ్రెడ్ తింటూ కనిపించాడంట. దీంతో షాకైన సెహ్వాగ్.. ఇంత రాత్రి సమయంలో బ్రెడ్‌ ఎందుకు తింటున్నావు అని సెహ్వాగ్‌ ప్రశ్నించగా.. మరో 15నిమిషాల్లో బ్రెడ్‌ ప్యాకెట్‌ గడువు అయిపోబోతోంది అతని ఫ్రెండ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడంట.