TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒక్క మ్యాచ్ లో కోహ్లీ రెండు అరుదైన రికార్డులు

Published on: Fri Oct 11, 2019 4:39PM

 

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో చేశాడు. రెండో రోజు ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 63 వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ.. 295 బంతుల్లో 28 ఫోర్ల సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 254 పరుగులతో  అజేయంగా నిలిచాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది ఏడో డబుల్ సెంచరీకాగా.. భారత్ తరఫున టెస్టుల్లో ఏడో ద్విశతకం నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ మరో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. కెప్టెన్‌గా తొమ్మిదిసార్లు 150కి పైగా స్కోర్ చేసి.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు. అంతేకాదు.. టెస్టుల్లో 7 వేల పరుగుల మైలురాయిని దాటాడు కొహ్లీ. కాగా, భారత్ 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.