కోహ్లీ పెళ్లికి.. సచిన్ పెళ్లికి లింకేంటీ..?

 

ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ భారతీయ యువతపై వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. ఆ రోజుల్లో బ్యాట్ పట్టిన ప్రతి ఒక్కడు.. తమను తాము సచిన్‌లా ఊహించుకునేవాడు. టెండూల్కర్‌లా కష్టపడి పైకి రావాలని కలలు కనేవాడు. అలా ఆయన్ను చూసి క్రికెట్‌పై ప్రేమను పెంచుకున్నాడు విరాట్ కోహ్లీ. పట్టుదలతో పాటు ప్రతిభతో అండర్-19 కెప్టెన్ స్థాయి నుంచి జాతీయ జట్టుకు నాయకత్వం వహించే రేంజ్‌కి ఎదిగాడు విరాట్. అతని దూకుడైన ఆటను చూసిన చాలా మంది దిగ్గజాలు.. సచిన్ రికార్డులను బద్దలు కొట్టగల సత్తా కోహ్లీ ఒక్కడికే ఉందంటూ ప్రశంసిస్తున్నారు. విరాట్‌కు సచిన్ అంటే ఎంతో అభిమానం.. తనకు ఆటలో స్పూర్తి ఆయనే అని ఎన్నోసార్లు చెప్పాడు. ఆటలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ సచిన్‌ను మార్గదర్శిగా చేసుకున్నాడు కోహ్లీ. సచిన్‌ ఆ రోజుల్లో డాక్టర్‌గా పనిచేస్తున్న అంజలిని ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల పైకి తీసుకెళ్లాడు. ఇప్పుడు కోహ్లీ కూడా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే మీకిక్కడ ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే "ఏజ్ గ్యాప్".. సచిన్ కన్నా ఆయన భార్య అంజలి ఆరేళ్లు పెద్దది. ఇక కోహ్లీ కన్నా అనుష్క ఆరు నెలలు పెద్దది.. ఆమె 1988 మే 1న జన్మించగా.. అతను అదే ఏడాది నవంబరు 5న పుట్టాడు. సో.. అదన్న మాట మ్యాటర్.