కోహ్లీ, అనుష్క శర్మల ఆస్తి ఎంతో తెలుసా..

 

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి ఇటలీలో జరుగుతుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే వారు ఇటలీ వెళ్లారు అని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వీరి పెళ్లి సంగతి పక్కన పెడితే.. వాళ్లు సంపాదన గురించిన వివరాలు మాత్రం బయటపడ్డాయి. ఇక వీళ్ల ఆస్తి వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే. ముందుగా విరాట్ కోహ్లీ..

 

అతి తక్కువ సమయంలో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా పేరుతెచ్చుకున్నాడు కోహ్లీ. అంతేకాదు ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంటూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో 7వ స్థానంలో, ఇండియాలో మొదటి స్థానంలో నిలుచున్నాడు. కోహ్లీ పేరిట రూ. 42 కోట్ల విలువైన ఆస్తులు, 18 కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్, ఆరు లగ్జరీ కార్లు తదితరాలెన్నో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కోహ్లీ పేరిట రూ. 390 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

 

ఇక అనుష్క శర్మ విషయానికొస్తే.. 'రబ్ నే బనాది జోడీ' చిత్రంతో బాలీవుడ్ లో పేరు తెచ్చుకుని, ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించడంతో పాటు ఓక్కో చిత్రానికి రూ. 5 కోట్ల వరకూ, ఏదైనా కంపెనీకి ప్రచారం తీసుకోవాల్సి వస్తే రూ. 4 కోట్లను తీసుకుంటుంది. అనుష్క వద్ద రూ. 36 కోట్ల వ్యక్తిగత పెట్టుబడులు ఉన్నాయని, నాలుగు లగ్జరీ కార్లు, ఇల్లు, వ్యాపారాల్లో భాగస్వామ్యం మొత్తం కలిపి రూ. 220 కోట్లని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఆస్తుల విలువ రూ. 300 కోట్లను దాటేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి ఆస్తి కలిపితే అది రూ. 600 కోట్లను ఇట్టే దాటేస్తుంది. ముందు ముందు ఈ ఆస్తి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.