లంక ఓవరాక్షన్.. డిక్లేర్ చేసిన కోహ్లీ

సాధారణంగా టెస్టు మ్యాచ్‌ల్లో భారీ స్కోరు సాధిస్తే గానీ.. లేదంటే ప్రత్యర్థి జట్టు వీక్‌గా ఉన్నప్పుడో బ్యాటింగ్ చేస్తున్న జట్టు సారథి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాడు. కానీ కోపంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ఎక్కడైనా విన్నారా.?? చూశారా.? అలాంటి పరిణామం భారత్-శ్రీలంక మధ్య జరిగింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధాటిగా బ్యాటింగ్ చేస్తుండటంతో లంక క్రికెటర్లు ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారు.

 

దీంతో కాలుష్యం బాగా ఎక్కువగా ఉందని.. తాము ఆడలేమని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో మాస్కులు ధరించి ఫీల్డిండ్ చేశారు. కొద్దిసేపు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ మ్యాచ్‌ను నిలిపివేయాల్సిందిగా కోరారు. పదే పదే ఇలాగే మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో కోహ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసహనంతో బ్యాట్‌ను విసిరేసి అసంతృప్తిని తెలిపాడు. ఈ క్రమంలోనే వికెట్ కోల్పోయి అనంతరం 7 వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫీల్డింగ్ మనమే చేద్దాం.. లంకను బ్యాటింగ్ చేయనిద్దాం అనే అర్థం వచ్చేలా డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైగ చేశాడు.