మేం ఓడిపోవడానికి కారణం అదే...

 

ఆస్ట్రేలియాకు-టీమిండియాకు మధ్య టీ20 సీరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. దీంతో తమ ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఓటమికి కారణాలేంటో చెప్పాడు. ‘మాకు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చేయలేకపోయాం. క్రీజులో కుదురుకొనేందుకు కొద్దిసేపైనా వికెట్లను అంటిపెట్టుకొని ఉండాల్సింది. కానీ అనుకున్న పని చేయలేకపోయాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మేము గ్రౌండ్‌లో 120 శాతం కష్టపడాలి. దానికోసం జట్టు మొత్తం కట్టుబడి ఉంది. ఈ రోజు ఆస్ట్రేలియా మాకంటే ఎంతో బాగా ఆడింది. మేము బ్యాటింగ్‌లో విఫలమయ్యామ’ని అన్నాడు. అంతేకాదు.. నాలుగు ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన ఆసీస్‌ బౌలర్‌ జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.