TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లాస్ట్ టెస్ట్ మ్యాచ్.. ఆడుతానో..లేదో..?

Published on: Fri Mar 24, 2017 12:34PM

 


ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు ఇరు జట్లమధ్య ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడుతాడా అంటే కాస్త సందేహంగానే ఉంది. ఈ విషయాన్ని కూడా తానే చెప్పాడు. రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వ‌బోయే చివ‌రి టెస్టులో వంద శాతం ఫిట్‌గా ఉంటేనే బ‌రిలోకి దిగుతాన‌ని కోహ్లి స్ప‌ష్టంచేశాడు. ఇప్ప‌టికీ ఇంకా చికిత్స తీసుకుంటున్నాన‌ని, ఆడ‌తానో లేదో ఇప్పుడే ఏమీ చెప్ప‌లేన‌ని అత‌ను అన్నాడు. ప్ర‌తి మ్యాచ్ త‌న‌కు ముఖ్య‌మైన‌దేన‌ని, పూర్తి ఫిట్‌గా ఉంటేనే ఆడ‌తాన‌ని తెలిపాడు. కాగా రాంచీ టెస్టులో తొలి రోజు ఆట భాగంగా విరాట్ కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.