కోహ్లీని ట్రంప్ తో పోల్చిన ఆసీస్..
Published on: Tue Mar 21, 2017 5:29PM

టీమిండియాలో కోహ్లీకి కాస్త దూకుడు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు అది ఎక్కువగా ఉన్నా..కెప్టెన్ అయిన తరువాత మాత్రం కాస్త దూకుడు తగ్గించాడు. అయితే ఇప్పుడు కోహ్లీపై ఆస్ర్టేలియా జట్టు మాత్రం కోహ్లీపై విషం కక్కుతుంది. గతంలో కూడా కోహ్లీకి, ఆసీస్ కి సరిగా పడదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు-ఆస్ట్రేలియాకు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో..స్మిత్ కు కోహ్లీ కి మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియా జట్టు విషం కక్కింది. కోహ్లీని ట్రంప్ తో పోల్చుతూ అక్కసు వెళ్లగక్కింది. 'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పోలిన వ్యక్తి వరల్డ్ స్పోర్ట్స్లో ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లినే అని...వరల్డ్ స్పోర్ట్స్ లో కోహ్లి మరో ట్రంప్' అని తన కథనంలో విమర్శలు గుప్పించింది. దేశ క్రికెట్ కెప్టెన్ స్మిత్ పై విరాట్ అనవసరపు ఆరోపణలు చేశాడని తొలుత విమర్శించిన ఆసీస్ మీడియా.. తాజాగా మరో అడుగు ముందుకేసి విరాట్ ను ట్రంప్ తో పోల్చింది. మరి దీనిపై కోహ్లీ.. ఇండియా జట్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


