కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డ్..

posted on: Jan 30, 2017 10:38AM

 

తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇప్పటివరకూ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా స్టార్ ఆటగాడు, కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు మరో అవార్డును సొంతం చేసుకున్నాడు. కాకపోతే ఇది మంచి రికార్డు కాదు.. చెత్త రికార్డు. ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లండ్ జట్ల మధ్య టీ-20 మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగానే నిన్న జరిగిన మ్యాచ్ లో కోహ్లి 21 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో టీ-20ల్లో ఇంగ్లండ్ పై చెత్త రికార్డు అప్రథను మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకూ ఇంగ్లండ్ పై ఎనిమిది ట్వంటీ 20ల్లో విరాట్ నమోదు చేసిన సగటు 29.25. పొట్టి ఫార్మాట్ ఇది విరాట్ చెత్త ప్రదర్శనగా నమోదైంది. మిగతా ఏ అంతర్జాతీయ జట్టుపై కూడా టీ-20ల్లో కోహ్లి ఇంతటి ఘోర ప్రదర్శన చేయలేదు. ఇంగ్లండ్ పై అతడు ఆడిన ఎనిమిది టీ- 20ల్లో 20కిపైగా పరుగుల్ని ఆరుసార్లు సాధించడంతో...అత్యంత చెత్త యావరేజ్ ను ఇంగ్లండ్ పై నమోదు చేసుకున్నాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...