TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోహ్లీ ది గ్రేట్‌.. టెస్టుల్లో వందో క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌...

Published on: Thu Jan 13, 2022 12:24PM

బీసీసీఐకి కోహ్లీ ఇప్పుడు మోస్ట్ కాంట్ర‌వ‌ర్సీగా మారాడు. ప‌గ‌బ‌ట్టి మ‌రీ విరాట్‌ను వ‌న్డే టీమ్ కెప్టెన్సీ నుంచి తొల‌గించారు. కోహ్లీలాంటి ఆట‌గాడిపై వేటు వేయ‌డాన్ని ఫ్యాన్స్ త‌ట్టుకోలేక‌పోతున్నారు. తీవ్ర అసంతృప్తి ఉన్నా.. కోహ్లీ కామ్‌గా త‌న ఆటేదో ఆడేస్తున్నారు. త‌న‌కు సాటి మ‌రెవ‌రూ లేర‌ని నిరుపిస్తున్నారు. 
 
లేటెస్ట్‌గా.. టీమ్‌ఇండియా టెస్ట్ కెప్లెన్ విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్నాడు. ఈ రికార్డు సాధించిన ఆరో టీమ్‌ ఇండియా ఆటగాడిగా (వికెట్‌ కీపర్లు కాకుండా) రికార్డులకు ఎక్కాడు. 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా మహ్మద్ షమి వేసిన 56వ ఓవర్ సెకండ్ బాల్‌కి.. తెంబా బవుమా (28) ఇచ్చిన ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ క్యాచ్‌ను ఎంతో చాకచక్యంగా అందుకొన్నాడు కోహ్లీ. రెండో స్లిప్‌లో ఉన్న విరాట్‌ తన ఎడమచేతి వైపు డైవ్ చేస్తూ నేలను తాకబోయిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. విరాట్‌ పట్టిన ఈ క్యాచ్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు ఆ వీడియోను తెగ‌ షేర్‌ చేస్తున్నారు. 

ఈ క్యాచ్‌తో టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్న ఆరో ఫీల్డర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ.  టీమ్‌ఇండియా తరఫున అత్యధికంగా రాహుల్‌ ద్రవిడ్‌ 209 టెస్టు క్యాచ్‌లు అందుకున్నాడు. హైదరాబాద్ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ 135 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ 115 క్యాచ్‌ల‌తో ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.