ప్రతీ పౌరుడు వీఐపీనే-మోడీ
Published on: Sun Apr 30, 2017 3:29PM
.jpg)
దేశంలోని ప్రతీ పౌరుడు ముఖ్యమైన వ్యక్తేనన్నారు ప్రధాని మోడీ..మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నవ భారతం అనే మా విధానానికి అర్థం వీఐపీల స్థానంలో ఈపీఐకి ప్రాధాన్యత పెంచడమేన్నారు. అందుకే వీఐపీల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని నిర్ణయించామని ప్రధాని అన్నారు. దేశంలోని 125 మంది ప్రజలలోనూ ఏదో ఒక గొప్పదనం ఉందన్నారు. యువ స్నేహితుల్లరా ఈ వేసవి సెలవుల్లో నైపుణ్యాభివృద్ధి సాధించండి..కొత్త ప్రదేశాలకు వెళ్లండి..కొత్త కొత్త అనుభవాలు సంపాదించుకోవాలని..కొత్త భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో అందరం భాగస్వామ్యమవుదామని మోడీ పిలుపునిచ్చారు.


