Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
posted on: Jul 7, 2025 5:27AM
.webp)
తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. జులై 16న శ్రీవారి ఇలయంలో ఆణివారం ఆస్థానం నిర్వహించనున్నట్లు పేర్కొన్న టీటీడీ.. అంతకు ముందు రోజు అంటే జులై 15న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ కారణంగా ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా జులై 14న కూడా ప్రొటోకాల్ వినా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని కోరింది.






