TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వినేష్ ఫొగాట్‌కి అస్వస్థత!

Published on: Mon Aug 19, 2024 10:44AM

ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో అనూహ్యమైన అనుభవాన్ని ఎదుర్కొన్న వినేష్ ఫొగాట్ స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్యారిస్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ఆమె తన స్వగ్రామమైన హర్యానాలోని బలాలికి పది గంటలపాటు ప్రయాణించి చేరుకుంది. స్థానికులు వినేష్ ఫొగాట్‌కి ఆమెకు భారీ లడ్డూని బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూర్చున్న వినేష్ స్పృహ కోల్పోయినట్టుగా కొద్దిసేపు కుర్చీలో తల వాల్చి కూర్చున్నారు. దాంతో అక్కడున్న అందరూ ఆందోళన చెందారు. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా వినేష్ ఫొగాట్ మాట్లాడుతూ, ‘‘బిజీ షెడ్యూలు కావడం, సుదీర్ఘంగా ప్రయాణిస్తూనే వుండటం, నిద్ర లేకపోవడం వల్ల అలసిపోయాను. అంతకంటే ఆందోళన చెందాల్సిందేమీ లేదు’’ అన్నారు.