వినేష్ ఫొగాట్ కేసు.. 16న తీర్పు!
Published on: Tue Aug 13, 2024 9:50PM
వినేష్ ఫొగాట్ కేసులో తీర్పు వాయిదా పడింది. ఆగస్టు 16వ తేదీన తీర్పు వెలువరించనున్నట్టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) ప్రకటించింది. వంద గ్రాముల బరువు ఎక్కువ వున్నందుకు పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు వేయడాన్ని రెజ్లర్ వినేష్ ఫొగాట్ సవాలు చేసింది. ఈ వ్యవహారంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)ని వినేష్ ఫొగాట్ ఆశ్రయించింది. సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుంది. కానీ ఈసారి ‘కాస్’ న్యాయమూర్తులు తీర్పు గడువును పలుసార్లు పొడిగించారు. మంగళవారం నాడు కూడా కాసేపట్లో తీర్పు వస్తుందని అందరూ భావిస్తూ వుండగా, ‘కాస్’ ఆగస్టు 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.


