ఖైరతాబాద్ గణేష్.. షార్ట్ సర్క్యూట్....

 

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడి వద్ద సోమవారం ఉదయం షార్ట్ సర్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్లెక్సీలు కాలి పోయాయి. వెంటనే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అలాగే ఖైరతాబాద్ సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గణేషుడి నిమజ్జనం సోమవారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాదులో దాదాపు నలభై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ వినాయకుడి పైన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.