విల్లుపురం వ‌రుడు.. కొత్త‌ర‌కం ప్ర‌చారం!

posted on: Jul 18, 2022 4:34PM

ఈ రోజుల్లో చ‌దువులు, ఉద్యోగాల‌తో పిల్ల‌ల పెళ్లిళ్లు కాస్తంత ఆల‌స్యంగానే జ‌రుగుతున్నాయి. కొంద‌రు త‌మ వృత్తిలో వున్న‌వారినే ఇష్ట‌ప‌డుతున్నారు, మ‌రికొంద‌రు బ్యాంక‌ర్ల‌ను, ఇంకొంద‌రు అంత అర్జెంటే మిటి త‌ర్వాత చూద్దాంలే అన్న ఆలోచ‌న‌లోనూ వున్నారు. దీనికి అమ్మాయి, అబ్బాయి అని లేదు ఇద్ద‌రూ ఒకే విధంగా ఆలోచించ‌డ‌మే ఈ కాలం విడ్డూరం. అయితే మ‌ధురై విల్లుపురానికి చెందిన జ‌గ‌న్ మాత్రం కొత్త ఆలోచ‌న చేశాడు. మాట్రిమోనియ‌ల్ సంస్థ‌ల్లో పేరు న‌మోదుచేసుకోవ‌డం వాటి చుట్టూ తిర‌గ‌డం ఇష్టం లేదేమో..  త‌న వివ‌రాలు, ఫోటోతో న‌గ‌రంలో ఏకంగా పోస్ట‌ర్లే పెట్టేశాడు. 

విల్లుపురానికి వెళ్లే వాహ‌న దారులంతా ఆ పోస్ట‌ర్లు చూసి కొత్త కార్పోరేట‌రో, రాజ‌కీయ యువ నేత అనే భ్ర‌మ లో వున్నారు. కానీ కాస్తంత ఆగి చూస్తే అదేమికాదండీ.. అమ్మాయి కోసం వేట‌లో వున్నాడ‌న్న‌ది పోస్ట‌ర్ చెబుతోంది! మార్కెటింగ్ లో ప‌నిచేస్తున్న జ‌గ‌న్ ఈ పోస్ట‌ర్ల‌కి ఏకంగా రెండు ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టాడ‌ట‌!

ఈ అత్యాధునిక ఆలోచ‌న చేసిన వ‌రుడు ఎం.ఎస్. జ‌గ‌న్ త‌న‌కు త‌గిన అమ్మాయి వేట‌లో వున్నాడు. గ‌త ఐదేళ్లుగా త‌గిన అమ్మాయి కోసం వెతుకులాడ‌టంలో ఈ ఉపాయం అమ‌లు చేశాడు. ఇలా త‌న‌ని తాను పెళ్లిళ్ల మార్కెట్లో పెట్టుకోవ‌డం బాగా ఖ‌ర్చుతో కూడిన ప‌నే అయినా మ‌నోడు ధైర్యం చేశాడు. అన్న‌ట్టు జ‌గ‌న్‌కి స్పూర్తినిచ్చింది.. లండ‌న్ కుర్రాడి క‌ధ‌. 

జీవ‌న్ భాచు అనే భార‌తీయ సంత‌తికి చెందిన కుర్రాడు అక్క‌డ రెండు పెద్ద హోర్డింగ్‌ల‌ను అద్దెకు తీసుకుని తాను మంచి భ‌ర్త‌ను కాగ‌ల‌న‌ని వివ‌రిస్తూ పోస్ట‌ర్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇంత‌కంటే మంచి ఇండియ‌న్ మీకు భ‌ర్త‌గా ల‌భించ‌డు అనీ టాగ్ లైన్ పెట్టాడు! కానీ మ‌న  జ‌గ‌న్ మాత్రం త‌న పోస్ట‌ర్‌లో ఫోటోతో పాటు త‌న వివ‌రాల‌నూ త‌మిళంలో పెట్టాడు.  విల్లుపురంకేసి వెళితే  ఇత‌గాడి సంగ తేమిటో తెలుసుకోండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...